30, జూన్ 2014, సోమవారం

faza bhi hai jawan jawan ... తెలుగు లో ... నా గీతం గా ...










కన్నాను కలలు ప్రియతమా
నేడైనా నన్ను చేరుమా                          
చెప్పానా నీకు ఎప్పుడు              
నువ్వే నా గుండె చప్పుడు


నా తోడు చేరవెందుకు  

నా అలక తీర్చవెందుకు 
ఫలింపచేయి నా ఆశ
మరెందుకూ ఏదో మిష

నాకెందుకూ ఈ వ్యధ 

రాదెందుకూ నీ దయ
చెప్పానా నీకు ఎప్పుడు  
నువ్వే నా గుండె చప్పుడు        

కన్నాను కలలు ప్రియతమా ...



ఈ ప్రాయమే నీదిగా

ఈ ప్రాణమే నీదిగా  
చేశావు బాస ఎందుకూ   
తప్పావు మాట ఎందుకూ
                                                        
నీ తోడు నన్ను వీడగా                                  
ప్రాణమ్మే నన్ను వీడదా   
చెప్పానా నీకు ఎప్పుడు      
నువ్వే నా గుండె చప్పుడు

కన్నాను కలలు ప్రియతమా ...



ఓదార్పువై  చేరుమా

నిట్టూర్పులే తీర్చుమా
ఈ గుండె మంటలార్పుమా
నీ దారి నన్ను చేయుమా

నీ చేతి స్పర్శ చాలులే

కడంట శ్వాస నిలుపులే
చెప్పానా నీకు ఎప్పుడు   
నువ్వే నా గుండె చప్పుడు

కన్నాను కలలు ప్రియతమా 

నేడైనా నన్ను చేరుమా                          
చెప్పానా నీకు ఎప్పుడు              
నువ్వే నా గుండె చప్పుడు

కన్నాను కలలు ప్రియతమా ...



faza bhi hai jawan jawan ...
రాగానికి ఒక పూర్తి స్వేచ్చానుసరణ... సరదాగా ...
tune sync కానిచోట మార్చుకోండి ప్లీజ్ ... 



2 కామెంట్‌లు:

  1. కలలుకనే కళ్ళు కంఠాన్ని సవరించుకోలేకపోతే ఏం పాడను :-) But your song is good

    రిప్లయితొలగించండి
  2. ఆకాంక్ష మేడం గారు...
    సారీ...చాలా లేట్ గా చూశాను
    మీ వ్యాఖ్యను.
    ఈ పోస్ట్ 'సా...విరహే'
    లో పబ్లిష్ చేసినప్పుడు
    ఎక్కడా నాకు నెట్ లో ట్రేస్ కాలేదు...
    అందుకని మళ్ళీ 'nmraobandi' లో
    పబ్లిష్ చేశాను...దాంతో మళ్ళీ ఇటువేపు
    చూడలేదు.

    మీరన్నది నిజమే...
    మళ్ళీ కలగనడమే...
    కంఠం ఈ సారైనా
    సవరించడానికి ...

    thnx for the compliment...

    రిప్లయితొలగించండి