కన్నాను కలలు ప్రియతమా
నేడైనా నన్ను చేరుమా
చెప్పానా నీకు ఎప్పుడు
నువ్వే నా గుండె చప్పుడు
నా తోడు చేరవెందుకు
నా అలక తీర్చవెందుకు
ఫలింపచేయి నా ఆశ
మరెందుకూ ఏదో మిష
నాకెందుకూ ఈ వ్యధ
రాదెందుకూ నీ దయ
చెప్పానా నీకు ఎప్పుడు
నువ్వే నా గుండె చప్పుడు
కన్నాను కలలు ప్రియతమా ...
ఈ ప్రాయమే నీదిగా
ఈ ప్రాణమే నీదిగా
చేశావు బాస ఎందుకూ
తప్పావు మాట ఎందుకూ
నీ తోడు నన్ను వీడగా
ప్రాణమ్మే నన్ను వీడదా
చెప్పానా నీకు ఎప్పుడు
నువ్వే నా గుండె చప్పుడు
కన్నాను కలలు ప్రియతమా ...
ఓదార్పువై చేరుమా
నిట్టూర్పులే తీర్చుమా
ఈ గుండె మంటలార్పుమా
నీ దారి నన్ను చేయుమా
నీ చేతి స్పర్శ చాలులే
కడంట శ్వాస నిలుపులే
చెప్పానా నీకు ఎప్పుడు
నువ్వే నా గుండె చప్పుడు
కన్నాను కలలు ప్రియతమా
నేడైనా నన్ను చేరుమా
చెప్పానా నీకు ఎప్పుడు
నువ్వే నా గుండె చప్పుడు
కన్నాను కలలు ప్రియతమా ...
faza bhi hai jawan jawan ...
రాగానికి ఒక పూర్తి స్వేచ్చానుసరణ... సరదాగా ...
tune sync కానిచోట మార్చుకోండి ప్లీజ్ ...