5, జనవరి 2014, ఆదివారం

ఊహల ఊయల...




 ఈ మనసెంత పిచ్చిది...
ఎందుకో దీనికింత వెర్రి  ఆలోచన...
ఊహల రెక్కలపై ఎగిరొచ్చి...
నా కన్నా ముందే నువ్విక్కడుంటావని
మనసు విప్పి  ఎదురుచూస్తుంటావని...   
నా మనసును మైమరపిస్తావని...
ఏదో  తోచని  భ్రమతో వెదుకుతుంది...
ఒక తీయని కధగా బ్రతుకుంది...

పాపం దానికేం తెలుసు...
ప్రక్కను చుక్కల్లో పరుచుకుని
నువ్వు చక్కగా లోకాన్ని మరిచి
హాయిగా నిదురిస్తున్నావని...
కలతనేదే నీకు లేదని...
మమతనేదే మరీ  కొంచెమని...
అది పంచాలనే ఆలోచనే దరికి రాదని...

అయినా...
నిద్రించు నేస్తం... హాయిగా...
నన్ను మరచి... నిదురిస్తూనే  ఉండు...

నష్టం  నే  భరిస్తా గానీ...
కష్టానికి నిను గురిచేస్తానా...


ఏదో ఒక రోజు రాకపోదు...
నీ తప్పు నీకు తెలియక పోదు...
నీ మనసు కన్ను విప్పక పోదు...

అప్పుడు  నా జతకు చేరక పోదు...


2 కామెంట్‌లు:

  1. జీవితానికి ఆశేగా మరి చుక్కాని...
    ఆ దిశేగా మనకు మరి రహదారి...

    చక్కటి పేరు...
    ఇంచక్కటి చిత్రం...

    సాదర ఆహ్వానం...
    నా బ్లాగుకి...
    నా మైత్రికి...
    ఓ ధాత్రికి...

    రిప్లయితొలగించండి